Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: గుంటూరులోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినా, చివరికి స్వదేశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి సంస్కారాన్ని కూడా నేర్పాలని వెంకయ్య నాయుడు అన్నారు. తాను గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలకతో చదువు ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల విద్యార్థులు ఒకప్పుడు భారతదేశంలోని నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారని చెప్పారు.
కుటుంబ విలువలను కాపాడుకోవాలి
తల్లిదండ్రులతో సమయం గడపాలని, కుటుంబ వ్యవస్థకు భారత్ మూలస్థానమని పేర్కొన్నారు వెంకయ్య.. చిన్న వయసులోనే తన తల్లి మరణించగా, తన తాతయ్య, అమ్మమ్మ తనను పెంచారని, ప్రపంచ జ్ఞానాన్ని వారే నేర్పారని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. ఇక, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో 17 నెలలు జైలులో ఉన్నానని, 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేశానని, రాజకీయాల్లో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు గోడలపై రాసిన తాను, తర్వాత ఆయనతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒకే వేదికపై కూర్చోవడం జీవితంలో మరపురాని అనుభవమని చెప్పారు.
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
యువతకు ప్రేరణాత్మక సందేశం
“ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు” అని విద్యార్థులకు సూచించిన వెంకయ్య నాయుడు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రకృతిని ప్రేమించాలని, ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఇక, “నేను పదవికి రిటైర్ అయ్యాను గానీ, పెదవికి రిటైర్ కాలేదు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన ఆయన, ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, విశ్వగురువుగా నిలిచే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రతి యువకుడు దేశ పురోగతికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!