Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్‌లైన్ ద్వారా తెలుస్తోంది. “When family means everything, a man will do anything for them” అనే లైన్‌తో తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సాయి కుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది. ఆగస్టు 12న భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందో చూడాలి.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
When family means everything, a man will do anything for them ❤️🔥#IrumudiTrailer out on 12th August with a grand launch event at SRKR Engineering College, Bhimavaram ❤🔥
In cinemas from 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟮𝟭𝘀𝘁, 𝟮𝟬𝟮𝟲.#IRUMUDI / #IRUMUDIKATTU
Starring MASS MAHARAJA… pic.twitter.com/r1oLquBu4U
— Mythri Movie Makers (@MythriOfficial) August 8, 2026
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!