Goshamahal Tension: గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపనకు నిరసనగా స్థానికులు, వ్యాపారులు గోషామహల్ బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖి చేసి పంపుతున్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో స్టేడియంలో భారీగా నిర్వహించాల్సిన సభ వాయిదా పడింది. నిన్న భారీగా ఏర్పాటు చేసిన టెంట్ నీ తొలగించి కేవలం సీఎం రేవంత్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Read Also: Harish Rao: హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది!
ఇక, ఈరోజు బందు పాటించాలని గోషామహల్ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గోషామహాల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. లేకపోతే, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని స్థానికులు, గోషామహల్ పరిరక్షణ సమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచి పరిరక్షణ సమితి నాయకులను, స్థానికులతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్ లో నిర్బంధించారు. అలాగే, రోడ్లను మూసివేసి బస్తీ వాసులను బయటికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాటు ఉదయం నుంచి ప్లైవుడ్ దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు బందు పాటిస్తున్నాయి.