MP Raghunandan Rao: తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శివాలయం ధ్వంసం చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలిపారు. ఘటన మధ్యాహ్నం జరిగితే రాత్రి దాకా పోలీసులు రాలేదు.. కేవలం హిందువుల మీద 4 ఎఫ్ఐఆర్లు పెట్టారు.. నాలుగు పేర్లు రాసి ఆదర్స్ అని రాసి బీజేపీ, హిందూ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు.. పక్కన ఉన్న మదర్సాలోని పిల్లలను కూడా హిందువులే పోలీసులకు అప్పజెప్పారు.. ఇప్పటికే 19 మంది జైలుకు పోయారు.. ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు.. సీసీ కెమెరాలు బాగున్నాయి.. కమాండ్ కంట్రోల్ ఉందని పోలీసులు.. రాత్రి దాకా ఎందుకు స్పందించలేదు అని డీజీపీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
Read Also: TFJA: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’… అద్భుత స్పందన
అయితే, అక్కడ మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు. అక్కడ విగ్రహం పగిలిన తర్వాత మదర్స పిల్లలు లోపలికి పోయి వచ్చిన వీడియోలు ఎందుకు బయటకు రావు అని మండిపడ్డారు. రామాలయం జాగాలో మదర్స ఎట్లా వచ్చింది కలెక్టర్.. ఆ మదర్సలో ఉన్నోళ్లు ఏ దేశం వాళ్ళో చెప్పండి అని డిమాండ్ చేశారు. శివ నగర్, సదాశివ పేటలో ఉన్నట్టు వంటి మదర్సలో ఉన్నోళ్లు ఏ దేశం వాళ్ళు అని అడిగారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతీ మదర్సలోని వారందరూ ఏ రాష్ట్రం, ఏ దేశం వాళ్ళు.. వారికి ఏం నేర్పిస్తున్నారో సీఎస్, డీజీపీ చూడాలన్నారు. ఇక, ముత్యాలమ్మ దేవాలయం సంఘటన తర్వాత మీ ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందింది.. అక్కడ ఏం జరిగిందని గుమిగూడిన అందరినీ రిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Read Also: India Pakistan: పాకిస్తాన్‌లో వధువు, బోర్డర్‌లో వరుడు.. పెళ్లి కష్టమే..
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తెలంగాణతో పాటు హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, రోహింగ్యాలను వెళ్లగొట్టకపోతే భాగ్య నగరం మండుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. హైదరాబాద్ లో 70 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని అంటున్నారు.. ఇంతకీ ఏం జరుగుతున్నాదని ప్రశ్నించారు. గతంలో డీజీపీ ఆఫీసు మీద బురఖాలో వచ్చి దాడి చేసిన ఘటనను మర్చిపోవద్దని గుర్తు చేశారు. అహింసో పరమో ధర్మో అనేది మా నినాదం కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే హింస ఉంటది అని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.