రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వివాదాల్లోని దేవాలయ భూములకు త్వరలో విముక్తి కలిగిస్తామన్నారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారులతో సమావేశమైన కమిషనర్ హరి జవహర్ లాల్ పలు అంశాలు ప్రస్తావించారు. దేవాదాయ భూముల సమస్యలు, ఆడిట్ లెక్కలు, కొత్త జిల్లాల్లో దేవాదాయ శాఖ కార్యాలయాల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి చర్చించారు. దేవాదాయ భూములు దేవుడికే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వివాదాల్లో ఉన్న దేవాదాయ భూముల సమస్యలను…
ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ…
శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. శివరాత్రి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 22 నుండి వచ్చే మార్చి 4 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలన్నారు హరిజవహర్ లాల్. ప్రతి భక్తుడు మాస్క్ దరించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలన్నారు హరిజవహర్ లాల్. జిల్లా అధికారుల సహకారంతో నడకదారి వచ్చే…
దేవాదాయ శాఖ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు హరి జవహర్ లాల్. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలపై ఉద్యోగులతో జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. అందులో హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో కైంకర్యాలు, పూజలు సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించే అంశంపై దృష్టి పెడతాం. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయాల వద్ద కనిపించాలి. హిందూ సంప్రదాయాలను గౌరవించేలా, ఆచరించేలా ప్రోత్సహిస్తాం.…