తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతోంది. ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా… తిరుమలకు అనుమతిచ్చారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తనిఖీ సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయలేదు విజిలెన్స్ సిబ్బంది. అయితే కారు వెనుక అద్దంలో ”శిలువ గుర్తు., ave Maria’’ అనే అన్యమత శ్లోకంతో తిరుమలకు వచ్చింది కారు. వారు తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించిన తిరుమల విజిలెన్స్ సిబ్బంది అనంతరం శిలువ గుర్తును తొలగించి కారును భక్తులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. అయితే ఈ ఘటనతో విజిలెన్స్ అధికారుల పని పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారు అద్దం పైన ఉన్న గుర్తును కూడా చూడలేకపోయారా… అని విమర్శలు వస్తున్నాయి.