YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Minister Satya Kumar: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్నదానికి రుజువులు చూపించగలవా జగన్.. మీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు.
CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు.
Free Bus In AP: శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.
కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Taneti Vanitha: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.