HHVM : పవన్ కల్యాణ్ వీరమల్లు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా మూవీ ఉండబోతోంది. కోహినూర్ వజ్రాన్ని కాపాడే ధర్మకర్త పాత్రలో నేను నటించాను. ఎందుకో నాకు ఇది చాలా హైలెట్ పాయింట్ అనిపించింది. కొందరు మూవీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ సినిమా రాదేమో అన్నారు. ఇప్పుడు కొందరు బాయ్ కాట్ చేస్తామంటున్నారు.
Read Also : HHVM : వీరమల్లు అందుకే లేట్ అయింది.. పవన్ క్లారిటీ..
నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు. నా ప్రత్యర్థులు ఎంత మంది వచ్చినా ఈ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ చేస్తాం అంటూ తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. వీరమల్లు సినిమాకు ప్రీమియర్స్ వేస్తున్నామని.. అది మూవీకి ప్లస్ అవుతుందని చెప్పారు. తాను గతంలో ఎన్నడూ పెద్దగా ప్రమోషన్లు చేయలేదని.. ఈ మూవీ చాలా స్పెషల్ కాబట్టి ప్రమోషన్లు చేస్తున్నట్టు తెలిపారు. తన కోసం నిర్మాత ఐదేళ్లు ఎదురు చూశాడని.. అలాంటి వారికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత తనమీద ఉందన్నారు పవన్ కల్యాణ్.
Read Also : Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?