నేటి బాలలే రేపటి పౌరులు. ప్రాణం విలువను తెలిపే వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. చదువుకోవాల్సిన వయసులో చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. కలిసి మెలిసి ఉండాల్సిన విద్యార్థులు విచక్షణ కోల్పోయి.. ఇంకిత జ్ఞానం లేకుండా పిడి గుద్దులతో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా లోని ఒంగోలు లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడవ సంవత్సరం విద్యార్థులు క్లాస్ క్లాస్ రూంలో రెచ్చి పోయారు. గత కొంత కాలంగా మూడవ సంవత్సరం విద్యార్థుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరి పైన ఒకరు పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు.
Read also:Local BoI Nani: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. కీలక విషయాలు బయటపెట్టిన లోకల్ బాయ్ నాని స్నేహితులు
ఈ గొడవలో ఓ విద్యార్థి తలకి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ ఏడుకొండలు విద్యార్థుల ఘర్షణపై విచారణకు ఆదేశించారు. కాగా మూడవ సంవత్సరం విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారని యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. దీనితో యాజమాన్యం నాలుగు నెలల క్రితం పలువురు విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి పంపించింది. అయిన ఆ విద్యార్థుల్లో ఎలాంటి మార్పు రాలేదు. కాగా ఘర్షణలో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆపదలో ఉన్నది శత్రువైన కాపాడాలని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు చెప్తారు. అయితే ఈ విద్యార్థులు మాత్రం తోటి విధ్యార్ధులతోనే ఘర్షణకు దిగారు. విద్యార్థులం అనే విషయాన్ని మరిచి పోయి వీది రౌడీల లాగ పరవర్తించిన తీరు అత్యంత బాధాకరం.