ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది
AP Capital Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. మరోవైపు ఇవాళ పార్లమెంట్‌లో ఏపీ రాజధానిపై ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేసింది. మూడు రాజధానుల అంశంపై కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించలేదని వివరణ…