Balineni Srinivas Reddy Interesting Comments After Meeting With CM Jagan: పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ మధ్య జరిగిన సంభాషణ గురించి బాలినేని వివరిస్తూ.. తన నియోజకవర్గం గురించి సీఎం అడిగారన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి కూడా అడిగారన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ పదవి వద్దని తాను అప్పుడే చెప్పానన్నారు. ప్రోటోకాల్ గురించి తానెప్పుడూ ఫీలవ్వలేదని స్పష్టం చేశారు. పదవినే వదులుకుని వచ్చిన తాను.. ప్రోటోకాల్ గురించి ఫీలవుతానా? అని రివర్స్‌లో ప్రశ్నించారు. తమ సొంత పార్టీకి చెందినవారే కొందరు మీడియాకు లీకులిచ్చి.. దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
Viral news: ఇదేం పాడుబుద్ది రా సామి.. రోడ్డు పై ముద్దులతో రెచ్చిపోయిన కుర్రాళ్లు..
తన నియోజకవర్గంలో 200 కోట్లతో ఇళ్ల స్థలాల గురించి రెడీ చేస్తున్నామని.. దాని గురించే తాను సీఎంతో చర్చించామని బాలినేని స్పష్టం చేశారు. అలక ఎప్పుడూ లేదన్న ఆయన.. సొంత పార్టీకి చెందినవారే కొందరు తనని ఇబ్బందులు పెట్టారని, వారిపై ఫైట్ చేశానని కుండబద్దలు కొట్టారు. తాను తరచుగా సీఎం జగన్‌ని కలుస్తూనే ఉంటానని, ప్రస్తుత కలయిక కూడా అలాంటిదేనని వెల్లడించారు. గతంలో వారానికి ఒకసారి కలిశానని, ఇప్పుడూ కలుస్తూనే ఉంటానని పేర్కొన్నారు. టీడీపీ వారు కోర్టులో కేసు వేసినందుకే.. ఇళ్ల స్థలాలు ఆగాయని క్లారిటీ ఇచ్చారు. తాము మళ్లీ ఇస్తున్నామని.. దీనికి సంబంధించిన సగం నిధులు కూడా రిలీజ్ అయ్యాయని తెలిపారు. మిగతా వాటి గురించి కూడా సీఎంతో చర్చించానని.. సీఎంతో భేటీతో తాను సంతృప్తిగానే ఉన్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కీలక సమావేశం.. 2024 జూన్ కల్లా..