Balineni Srinivas Reddy : పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని స్పష్టం చేశారు. �
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను పార్టీ దూరంగా ఉన్నానని.. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి కనీసం పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. పార్టీకి చెబుదాం అంటే కనీసం వినే పరిస్థితుల్లో లేదన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని బాలినేని పిటిషన్ వేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించారు.
వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు.
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.