Charu Haasan Hospitalised : కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటించారు. కమల్ హాసన్‌కి మధ్య 23 ఏళ్ల వయోభేదం ఉంది. కన్నడ చిత్రం తబరణ కథేలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా చారు హాసన్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. చారు హాసన్ ఈ వయసులో కూడా విజయ్ శ్రీ దర్శకత్వంలో హర అనే సినిమాలో నటించారు. నటుడు చారు హాసన్‌కు ముగ్గురు కుమార్తెలు, వారిలో ఒకరు సుహాసిని. తమిళ చిత్రసీమలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సుహాసిని ఆ తర్వాత దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్!
చారు హాసన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన న్యూ సంగమం, IBC 215 అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. చారు హాసన్ 1979లో మహేంద్రన్ దర్శకత్వం వహించిన ఉతిరిప్ పూకేమ్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆయన నటుడిగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 120కి పైగా చిత్రాల్లో నటించారు. 93 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్ గా నటిస్తున్న చారు హాసన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న తన తండ్రితో ఉన్న ఫోటోను తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ సుహాసిని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. “మా నాన్న మెడికల్ వెకేషన్‌లో ఉన్నారు, డాక్టర్లు, నర్సులు – కుమార్తెల సంరక్షణతో ఆయన కోలుకుంటున్నారు అని పేర్కొన్నారు.