ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.
ఇక రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ… చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలి. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి నీచ సంస్కృతికి, దిగజారుడు రాజకీయాలకు దారి తీసిన వైసీపీ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని పేర్కొన్నారు.