బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తాను అని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాధవ్‌కు అప్పగించారు.…
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్…
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. మాధవ్‌ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్, కర్నాటక ఎంపీ పీసీ మోహన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్‌కు ధృవీకరణ పత్రంను ఎంపీ పాకా సత్యనారాయణ, పీసీ మోహన్ అందజేశారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు మాధవ్‌కు పార్టీ నేతలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం…
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నూతన అధ్యక్షుడి పేరును ఈరోజు అధిష్టానం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరు నిన్ననే ఖరారు కాగా.. నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 10:45కు అధ్యక్షుని పేరును ప్రకటిస్తారు. అనంతరం పదవీ ప్రమాణం, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష…
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. పాకా సత్యనారాయణ మాట్లాడుతూ… ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ…
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రసంశలు కురిపించారు. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అంటూ కితాబు ఇచ్చారు.
క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై…