Protest : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్‌జెండర్లు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్లు కలిసి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్‌కు చెందిన…
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు.
తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్.
కులగణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం మీద సంచలన విషయాలు బయట పెట్టారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్లోకి హీరో వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని ఒక్కటే దారి ఉంది కాబట్టి హీరో హీరోయిన్ రావద్దని చెప్పామని అన్నారు. హీరో కారులో వచ్చి…
BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.