ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారు. అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదు జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలి. అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని పేర్కొన్నారు. కోవిడ్ కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో…