Trisha : త్రిషకు ముద్దు పెట్టడానికి నిరాకరించిన ఆ స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్ సెల్వన్`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని సినిమాలలో రొమాన్స్ పండించిన అవి కూడా చాలా తక్కువ.కానీ ఆమె నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ `96` చిత్రంలో మాత్రం ముద్దు సీన్ కు ఓకే చెప్పింది. ఆ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే.
తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ మూవీలో లిప్ లాక్ సీన్ ఒకటి ఉంటుందట.. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్లు విడిపోయే సమయంలో లిప్ లాక్ పెట్టుకోవాల్సి వస్తుంది.. ముందుగా దర్శకుడు స్క్రిప్ట్ లో అలానే రాసుకున్నాడట. దానికి త్రిష కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్ట్ వద్ద త్రిష, విజయ్ సేతుపతి ఒకరినొకరు విడిపోవాల్సి రావడం జరుగుతుంది.. దీంతో ఆ ఫీలింగ్‌ని భరించ లేక త్రిష విజయ్‌సేతుపతి వద్దకి వచ్చి హగ్ చేసుకుంటుంది. కానీ ముద్దు పెట్టుకోదు. కేవలం హీరో తలని మాత్రమే పట్టుకుంటుంది. హీరో కూడా ఆమెని పట్టుకుని ఫీల్ అవుతుంటాడు.. అయితే ఆ సమయంలో త్రిషకి లిప్ లాక్ ఇచ్చేందుకు విజయ్ సేతుపతి నిరాకరించాడట.ఆయన ముద్దు సీన్లకి దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సీన్ చేయాల్సి వున్నా ఆయన చేయలేకపోయారట.చివరి నిమిషంలో విజయ్ సేతుపతి అంతటి సాహసం చేయలేకపోవడంతో ఆ సీన్ లేకుండానే సినిమాను ముగించారు. అయితే ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని అంతకంటే బలమైన ఫీల్‌ని కలిగించేలా యాక్ట్ చేయడం సినిమాకు హైలైట్ గా నిలిచింది.వారిద్దరి కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీ గా `96` మిగిలిపోతుంది
Also Read
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!