దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.
ముఖ్యమంత్రి ఇల్లు, ఆఫీసు ఒక చట్టబద్ధ వ్యవస్థ.. అటువంటి వ్యవస్థల పై దాడి చేయటానికి పిలుపు ఇవ్వటం చట్ట వ్యతిరేకం.. వాటికి కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. ఉద్యోగుల ఆందోళన, పిలుపులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చట్టబద్ధ వ్యవస్థ పై దాడి జరగకుండా నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. ఈ పిలుపునకు బాధ్యులైన వ్యక్తులను రాత్రి జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నాం.. వారందరికీ 41 నోటీసులు ఇచ్చి పంపించేశాం అన్నారు..…
ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగ్గారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయకపోవడంపై నిరసన చేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే ఆర్థిక శాఖ ఉద్యోగుల సినియార్టీ ఫైనల్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. సీఎం ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేయడం లేదంటూ ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో ఉద్యోగుల సినియార్టీని ఫైనల్ చేయలేదు ఉన్నతాధికారులు. ఎనిమిది మిడిల్ లెవల్ పోస్టులు…