ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 74,820 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,174 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,737 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 2,40,50,103కు చేరుకోగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,241 మంది ప్రాణాలు వదలగా.. 19,16,914 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 418, చిత్తూరులో 329 కేసులు నమోదు అయ్యాయి.