ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.…