Electricity Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది.. నవంబర్ నుంచి ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 13 పైసల వరకు తగ్గిస్తుండటంతో విద్యుత్ వినియోగదారులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.. బుధవారం రోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చౌడువాడ, కింతలిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరోవైపు, 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌరవిద్యుత్తు యూనిట్లను ఫ్రీగా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.. ఇక, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
Read Also: Balakrishna : షాకింగ్ : జైలర్ 2 రిజెక్ట్ చేసిన బాలయ్య.. మరో క్రేజీ సినిమా కూడా?