Electricity Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది..…
ఇసుక దోపిడీ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు అంటూ సంచలన ఆరోణలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు.