YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. మన టైం వస్తుంది.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం..!
- అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి..
- కొడతానంటే.. కొట్టమనండి.. మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి..
- అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం..
- సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి సర్కార్, అధికారులు, పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. కానీ, కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు.. అలా అయితేనే రాజకీయాలు చేయగలం.. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అని ఫైర్ అయ్యారు.
Read Also: Jyoti Malhotra Case: యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ కు జ్యోతి మల్హోత్రా కేసు
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఇక, చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడని దుయ్యబట్టారు వైఎస్ జగన్.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నంచేస్తోంది.. మెజార్టీ వైసీపీ ఉందంటే ఎన్నికను ఆపుతున్నారు.. పోలీసులు.. వైసీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు. టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు.. కానీ, రేపు కచ్చితంగా వైసీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని పేర్కొన్నారు.. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి… మనకూ టైం వస్తుంది.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం.. రిటైర్డ్ అయిన వారిని కూడా లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం.. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం అని హెచ్చరించారు.
చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి.. మహిళలు అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు.. ఇలా కేసులు మీదు కేసులు పెడుతున్నారు.. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. దళితుడైన నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు.. సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!