Damodara Raja Narsimha : వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ఇటీవల వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. సాధారణ ప్రసవం ద్వారా ఈ సంతానం లభించిందన్న విషయం వెలుగులోకి రాగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోనూ జడ్జి జ్యోతిర్మయి అదే ప్రభుత్వ ఆసుపత్రిలో తన మొదటి ప్రసవం జరిపారు. 2023లో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
Harihara Veeramallu: కీరవాణిని సన్మానించిన పవన్ కళ్యాణ్..
రెండవసారి కూడా అదే ఆసుపత్రిని ఎన్నుకోవడం ద్వారా, ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న విశ్వాసాన్ని ఆమె మరింత బలపరిచారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి రోజూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు 24/7 అందుబాటులో ఉండటంతో ప్రజలు నిర్భయంగా ఈ ఆసుపత్రులను ఆశ్రయించవచ్చని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న ఉచిత వైద్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.