National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nethanna Sevalo Scheme: బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయాన్ని సీఎం విడుదల చేయనున్నారు. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.179 కోట్లను విడుదల చేయనుంది. చీరాలలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు నేతన్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 10.30 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
మధ్యాహ్నం 1.35 గంటలకు జాండ్రపేటలోని చేనేతల వర్క్‌షాప్‌ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడ ‘నేతన్న సేవలో’ పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 4.10 గంటలకు కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.45 గంటలకు సీఎం తన క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!