Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ప్రతిపక్షం మాత్రం ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా పరామర్శ యాత్రల పేరుతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోందని మంత్రి ఆరోపించారు. జగన్ బయటకు వచ్చిన ప్రతిసారీ విధ్వంసం, అరాచకం జరుగుతోందని విమర్శించారు. మహిళలపై దాడులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బలప్రదర్శనలతో రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
పోలీసులను బెదిరించేలా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రతిపక్ష నేతల వ్యవహారం ఉందని మంత్రి అనిత ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో నిందితులను పరామర్శించేందుకు వెళ్తున్నారని, అయితే బాధిత కుటుంబాలను పరామర్శించడంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. సిదిరి అప్పలరాజు కుమారుడు దానయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా, ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని, విధ్వంస రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని మంత్రి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శాంతి, అభివృద్ధి, పెట్టుబడులే అవసరమని, ప్రజలు వాస్తవాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
Also Read
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
తాజావార్తలు
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!