ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం జరగనుంది.. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SLPB.. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది సమావేశం.. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన టార్గెట్‌గా ప్రభుత్వం ప్రణాళికలు పెట్టుకుంది.
సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని స్పష్టం చేశారు.. దీనిని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.. ఇప్పటికే ఇది అమల్లో ఉంది. సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుంది అన్నారు.
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డులో చర్చ జరిపారు. ఏపీలో పర్యాటకరంగానికి ఊతం ఇచ్చే దిశగా పలు కిలక ప్రాజెక్టులు రానున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా…