YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSP MPs Meet Amit Shah: న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం కలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా జిల్లాల పర్యటనల సమయంలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని, ఇటీవల దేవరపల్లి పర్యటనలో భారీగా ప్రజలు హాజరైనప్పటికీ సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని వివరించింది.
గత రెండేళ్లుగా వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఎంపీలు ఆరోపించారు. జగన్‌కు పటిష్టమైన భద్రత కల్పించేలా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
భద్రత అంశంతో పాటు డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని కూడా ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుల వివరాలను కూడా కేంద్ర హోంమంత్రికి వివరించారు.
గత రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయని, ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య హక్కులు, న్యాయపాలన, ప్రజల భద్రత పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!