Union Minister Murugan: కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు.. పోలవరం బాధ్యత మాదే..
- కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందన్న కేంద్ర మంత్రి మురుగన్..
- కేంద్ర.. రాష్ట్రాల్లో మోడీ.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ నేతృత్వంలో అద్భుతమైన విజయం..
- వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Murugan: కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు.. 2047లో భారత్ గ్లోబల్ లీడరుగా అవతరించేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.. బడ్జెట్‌లో ఏపీకి, అమరావతికి ప్రాధాన్యం ఇచ్చాం. దేశాభివృద్ధికి ఏపీ తోడ్పాటు ఇస్తుందన్నారు..
Read Also: Raviteja: మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ టీజర్ ఎప్పుడో తెలుసా..?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమన్నారు మురుగన్.. కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉందన్న ఆయన.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50,474 కోట్ల మేర లబ్ది చేకూర్చాం. ఏపీకి ప్రత్యేక ఆర్థిక చేయూత ఇచ్చే క్రమంలో అమరావతికి రూ. 15 వేల కోట్ల మేర నిధులు కేంద్రం ఇప్పించనుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంగా చెబుతున్నాం అన్నారు.. పోలవరం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. వివిధ కారిడార్ల ద్వారా ఏపీలో అభివృద్ధి చేపట్టడం.. ఉపాధి కల్పించడం వంటివి చేస్తాం. వెనుకబడిన జిల్లాలకు సాయం కొనసాగిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాం. వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి సహకారం అందిస్తాం అన్నారు.
Read Also: Gold PriceToday: షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?
ఇక, డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయనున్నాం అన్నారు మురుగన్.. కిసాన్ క్రెడిట్ కార్డులను ఆక్వా రైతులకూ కేంద్రం అందచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. ఏపీ నుంచే 60 శాతం రొయ్యల ఎగుమతులు జరుగుతున్నాయని వెల్లడించారు.. రొయ్యల సాగు మొదలుకుని, ఎగుమతుల వరకు నాబార్డు ద్వారా ఆక్వా రైతులకు ఆర్థిక చేయూత అందించేలా చర్యలు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!