ఏపీ ప్రతిపాదిత “బనకచర్ల ప్రాజెక్ట్” వివాదంపై రేపు అత్యున్నత స్థాయి సమావేశం జరుగనున్నది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీ కి చేరుకోనున్న ఏపి ముఖ్యమంత్రి.. రేపు ఉదయం ఢిల్లీకి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. తెలంగాణ వ్యతిరేకత, కేంద్ర అభ్యంతరాల నేపథ్యంలో చర్చ జరుగనుంది. అత్యున్నత స్థాయి (అపెక్స్ కమిటీ) సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.…
బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం అభ్యంతరాలపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఏపీ ఇరిగేషన్ సలహదారు అధికారులతో సమావేశం అయ్యారు.. అయితే, కేంద్ర జలసంఘం.. అడిగిన లెక్కలుపై చర్చ సాగుతోంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్.. నీటి లెక్కలపై అధ్యయనం చేస్తోంది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో పొడిగించాలని ఆయన కోరారు.
సామ్యాన్యులపై మరో బాదుడు షురూ కానుంది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల పాకెట్ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడుతున్న జనాలకునేటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యంమైంది. ఈనేపథ్యంలో.. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. అయితే.. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాగా..ఈ సమావేశంలో పలు…
రెస్టారెంట్, హోటళ్లకు వెళ్లే వారికి శుభవార్త తెలిపింది సీసీపీఏ సంస్థ. మనం ఆర్డర్ చేసి తినే తిండికన్నా ఎక్కవగా సర్వీస్ చార్జీలు కట్టాలంటూ తల పట్టుకునే పరిస్థితి. ప్రశ్నించడానికి కూడా సమయం లేకుండా.. బిల్లుల్లోనే ఆటోమేటిక్ గా చేర్చడాన్ని నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షన ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఆదేశాలు జారరీ చేసింది. ఒకవేళ వీటిని ఉల్లంఘించే హోటళ్లు, రెస్టారెంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. అయితే.. సర్వీస్ చార్జీల విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన,…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ పోతోంది.. ఇక, కొన్ని బ్యాంకులను విలీనం చేస్తూ ముందుకు సాగుతోంది.. దీంతో.. భవిష్యత్ ఉద్యోగుల తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు లేకపోలేదు.. మరోవైపు.. మరో రెండు బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర సర్కార్.. దానాకి అడ్డంకులు లేకుండా.. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని భావిస్తోంది.. ఈ సారి సెంట్రల్ బ్యాంక్…