పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.