CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించామని తెలిపారు. దీంతో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేమన్నారు. అయితే, రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు పెద్ద ఎత్తున తమ భూములను ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!
ఇక, అమరావతి రాజధానిలో తొలి భవనం ప్రారంభమైంది.. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. కానీ, భూములు ఇచ్చిన నేరానికి రైతులను గత ప్రభుత్వం నానా హింసలు పెట్టిందని ఆరోపించారు. రాజధాని ఒక ఏడారి, ఒక స్మశానం అని గత ప్రభుత్వంలోని నేతలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఇక, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.