Gold Price Hike Today in Hyderabad: భారతీయులు పసిడి ప్రియులు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పండగలు, వేడుకలు, శుభకార్యాల వేళ బంగారంకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పండగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆల్‌టైమ్ హై దాటేసి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తూ.. సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. తులం బంగారం ధర లక్షా 25 వేల మార్క్ దాటింది.
Also Read: Heart Health: సైలెంట్ కిల్లర్స్.. యువతలో గుండెపోటుకు ఈ 6 ఆహారపు అలవాట్లే కారణమా?
గత పది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. ఈరోజు కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 పెరిగి.. రూ.1,25,400కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడిపై రూ.300 పెరిగి.. రూ.1,14,950గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు కిలో వెండిపై రూ.5 వేలు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,85,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,95,000గా నమోదైంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.