సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీమ్ దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఓ కేసులో కోర్టులో హాజరుఅయ్యేందుకు విశాఖ వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు నెలలలో ఆరు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు..
సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్‌కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు... రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు..
దావోస్ పర్యటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన ఆయన.. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు.. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు.. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు.. జెడ్ ఎఫ్ ఫాక్స్‌కాన్ సీఈవోతో సమావేశమయ్యారు లోకేష్.. సప్లయ్ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు.. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు…
దావోస్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్ సీఐఐ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు.. పెట్టుబడుల అంశంపై మాట్లాడిన ఆయన.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారన్నారు... మూడో సారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది... కానీ, భారతదేశంలో లేదన్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించారు.