మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమ్మిట్ లో రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షించారు. మరో మూడు రోజుల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరుగనుంది.
Read Also:Twitter Layoff: డేటా ఎక్స్‌పర్ట్స్, ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్
వచ్చే నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచి పరిశ్రమలు రావటం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కారణంగా మొదటి రెండేళ్లు ఆర్ధిక కార్యక్రమాలే జరగని పరిస్థితి నెలకొంది. పైగా వచ్చే ఎడాది ఎన్నికలు కావటంతో ఇప్పుడు జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీలు సైతం ఈ సమ్మిట్ కు వచ్చే విధంగా కసరత్తు చేశారు. మొదటి రోజు జాతీయ, అంతర్జాతీయ బడా పారిశ్రామిక వేత్తలతో సమ్మిట్ కళకళలాడనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి.
ఇటు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ జీఐఎస్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు 25 దేశాల నుంచి 7, 500 మంది డిలిగేట్స్ ఈ సమ్మిట్ కు రిజిష్టర్ చేసుకున్నట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీవీఐపీల తాకిడి వల్ల సిటీలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా రూటింగ్ చేయటం, ఎక్కడికక్కడ సమ్మిట్ కు దారి తెలిసే విధంగా భారీ ఎత్తున హోర్డింగ్స్ , సిటీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ వంటి అనేక అంశాల పై ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా