టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల…
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.