డ్రై అంటే ఎండిపోడం, డే అంటే రోజు. డ్రైడే అంటే ఎండిపోయిన రోజు అని అర్థం. డ్రైడే అనే పదాన్ని దేనికోసం వాడతారు అంటే, లిక్కర్ హాలిడే కోసం డ్రైడే అనే పదాన్ని వినియోగిస్తారు. సాధారణంగా దేశంలో లిక్కర్ షాపులను బంద్ చేసిన రోజును డ్రైడే అని పిలుస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో డ్రైడే ఒకేవిధంగా ఉండదు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా లిక్కర్ హాలిడే కాబట్టి ఆరోజుల్లో డ్రైడే నడుస్తుంది. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో ప్రత్యేకంగా హాలిడేలను ప్రకటిస్తుంటారు. ఆయా రోజుల్లో ఆ రాష్ట్రం పరిధిలో డ్రైడే ఉంటుంది.
Read: Electric Vehicles: ఇండియాలో మరో రెండు హైస్పీడ్ ఈవీ స్కూటర్స్…
మామూలుగా నీరు, పండ్లరసాలు వంటివి తీసుకోకపోతే శరీరం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. శరీరం డ్ర అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా నీరు లేదా పండ్లరసాలు తీసుకోవాలని అంటారు. ఇప్పుడు దేశంలో మద్యం ఏ స్థాయిలో అమ్ముడవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలకు మద్యం ద్వారానే అధికంగా ఆదాయం లభిస్తుంది. ఇక మొదటగా దేశంలో డ్రైడే అనే పదాన్ని 1926లో పంజాబ్ రాష్ట్రంలో వినియోగించారు. పంజాబ్ ఎక్సైజ్ చట్టంలో ఈ పదాన్ని పేర్కొన్నారు. 1950 తరువాత కేంద్రం భారతదేశం వ్యాప్తంగా డ్రైడేని అమలు చేస్తున్నది.