తెలుగు రాష్ట్రాల్లో ‘బర్రెలక్క’ అనే పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బర్రెలక్క అసలు పేరు శిరీష.. కానీ తనకు డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేదు కాబట్టి బర్రెలు కాసుకుంటున్నాను అంటూ వీడియోలు చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు బర్రెలక్క అని పేరు పెట్టారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల మీద ఆసక్తితోనో లేక నిజంగానే నిరుద్యోగుల సమస్యల మీద పోరాడాలనో ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే.. ఎన్నికల్లో దాదాపు 5 వేల పైచిలుకు ఓట్లు సాధించింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఆమె పోటీ చేయడంతో రామ్ గోపాల్ వర్మ, వైఎస్ జగన్ వంటి వాళ్లు కూడా ఆమె పేరును ప్రస్తావించారు.
Read Also: Atrocious: ఇంత దారుణమా.. కన్నకూతురి మృతదేహాన్ని డబ్బులకు అమ్ముకుంటారా..?
కాగా.. శిరీష పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని ఇప్పటికే అందరికీ తెలియపరిచింది. సోషల్ మీడియాలో తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పింది.. అంతేకాకుండా, తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. అయితే మరోసారి తన పెళ్లి కారణంగా బర్రెలక్క సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రేపు తన వివాహం జరుగనుండగా.. ఈరోజు జరిగిన హల్దీ వేడుక వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె పెళ్లి కూతురిగా ముస్తబు కావడం ఉంది. ‘పెళ్లి పిల్లను చేస్తున్నారు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది. అయితే బర్రెలక్క హల్దీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: Proddatur: ప్రొద్దుటూరుకు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర.. మారుమోగుతున్న సభాప్రాంగణం