కరోనా కాలంలో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. మనదేశంలో మాస్క్ పెట్టుకోకుంటే పెద్దగా పట్టించుకోరు. పోలీసులు హెచ్చించి వదిలేస్తారు. కానీ, ఇంగ్లాండ్‌లో అలా కాదు, మాస్క్ పెట్టుకోకుంటే భారీగా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందని క్రిస్టోఫర్ ఓ తూలే అనే వ్యక్తి ప్రెస్కాట్ ఏరియాలో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడ ఎక్కువసేపు మాస్క్ పెట్టుకోలేక కాసేపు మాస్క్ తీద్దామని తీశాడు. మాస్క్ తీసిన క్షణాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి ఫైన్ వేశారు. తాను ఇప్పటి వరకు మాస్క్ పెట్టుకొని ఉన్నానని చెప్పినా పోలీసులు వినలేదట. ఆ తరువాత ఏసీఆర్ఓ క్రిమినల్ రికార్డ్ ఆఫీస్ నుంచి 100 పౌండ్లు కట్టాలని లెటర్ వచ్చింది.
Read: వైరల్: సముద్రంలో ఉత్తరం… ఇద్దరు మనుషులను ఇలా కలిపింది…
దాని గురించి పట్టించుకోలేదు. అయితే, ఏసీఆర్ఓకు తూలే మెయిల్ చేశాడు. మాస్క్ పెట్టుకోనందుకు కట్టి తీరాల్సిందే అని రిప్లై ఇచ్చారు. మాస్క్ పెట్టుకోనందుకు విధించిన పదివేల రూపాయల ఫైన్ కట్టనందుకు జరిమానాగా రెండు లక్షల రూపాయలు ఫైన్ కట్టాలని పోలీసులు పేర్కొన్నారు. ఈ తరువాత క్రిస్టోఫర్‌ను కోర్టుకు అప్పగించారు. త్వరలోనే కోర్టుకు వెళ్లి జరిగిన విషయాలను వెల్లడిస్తానని, అక్కడే ఫైన్ కడతానని అంటున్నాడు క్రిస్టోఫర్. 16 సెకన్లు మాస్క్ తీసినందుకు తనకు భారీ జరిమానా విధించడం దారుణమని అంటున్నాడు.