బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు ప్రస్తుత యూకే ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలలో లేబర్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది ఒక ప్రధాన వాగ్దానం. ఈ చర్య యూకేలో ఎన్నికలను స్కాట్లాండ్, వేల్స్‌కు అనుగుణంగా తీసుకువస్తుంది. ఈ రెండు దేశాలలో ఓటు వేయడానికి గరిష్ట వయోపరిమితి 16 సంవత్సరాలు. Also Read:Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర…
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం ఎదురైంది. ఖలిస్తానీ అనుకూల వర్గాలు జైశంకర్ వైపు దూసుకు రావడం సంచలనంగా మారింది. బుధవారం రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మిస్టర్ జైశంకర్ చాథమ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక ఖలిస్తానీ అనుకూల నిరసనకారుడు బారికేడ్లను దాటి, జైశంకర్ వైపుగా వచ్చి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Britain PM vs Elon Musk: బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌పై అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ విమర్శలకు బ్రిటన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్‌ఐ5 ఏజెన్సీ ఆరోపించింది.
UNSC: అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌లో జరిగిన చర్చలో, బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్…
బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
UK Election : బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు.