నీటిలో ఉన్నప్పుడు మొసలికి ఎంత బలం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంత బలమైన జంతువైన.. మొసలి ముందు బలాదూరే. నీటిలోకి వస్తే.. అమాంతంగా పట్టేస్తోంది. ఇప్పుడెందుకు మొసలి గురించి అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎవరైనా పెంపుడు జంతువులకు ఆహారం పెడతారు. అంతేకాని మొసలికి ఆహారం తినిపించిన సందర్భాలు ఎప్పుడూ కనిపించవు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం.. పెద్ద మొసలికి ఆహారం తినిపిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు
ఓ నది ఒడ్డున బురద పేరుకుపోయింది. అందులోంచి ఒక పెద్ద మొసలి బయటకు వచ్చింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. ఆహారం పెట్టేందుకు ప్రయత్నించాడు. ఎంత ఆశ్చర్యం అంటే.. చాలా విధేయతతో అతడి పెట్టిన ఆహారాన్ని తీసుకుంది. కానీ ఆ వ్యక్తిపై ఎలాంటి దాడి చేసేందుకు ప్రయత్నం చేయలేదు. పూర్తి విధేయత చూపించింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఆహారం పెట్టిన వ్యక్తి కూడా ఎలాంటి రక్షణ కవచాలు ధరించలేదు. భద్రతా ఏర్పాట్లు లేకుండానే అతడు బురదలో నడుచుకుంటూ ఆహారం తినిపించాడు. చాలా సేపు మొసలి ప్రశాంతంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Tragedy: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరి కొందురు తప్పుపట్టారు. మొసళ్లు.. ఏ క్షణంలోనైనా మార్పు చెందుతాయని హెచ్చరించారు. ఇది ఏమైనా మూర్ఖత్వపు చర్యేనని పేర్కొన్నారు. ఇంకొందరు పూర్తి నిర్లక్ష్యం అని తెలిపారు.