దాదాపు ఐదేళ్ళ క్రితం త్రిష నటించిన తెలుగు సినిమా ‘నాయకి’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. అయితే తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష తాజాగా తెలుగులో ఓ వెబ్ సీరీస్ లో నటించబోతోంది. చిరంజీవితో ‘ఆచార్య’లో నటిస్తుందని ప్రకటించినా ఎందుకో ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తాజాగా ‘బృందా’ అనే వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళా దర్శకుడు అవినాశ్ కొల్లా, ఆషిశ్ కొల్లా ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నారు. సూర్య వంగల ఈ సిరీస్ కి రచయిత, దర్శకుడు. దినేష్ కె బాబు సినిమాటోగ్రాఫర్ కాగా శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
Read Also : మెగా ఫ్యామిలీపై మోహన్ బాబు సెటైర్స్
ఈ వెబ్ సీరీస్ ను శుక్రవారం దసరా పండగ సందర్భంగా ప్రారంభించారు. ‘నాయకి’ తర్వాత తమిళంలో ‘కొడి, మోహిని, 96, పెట్టా, పరమపదమ్ వెలయాట్టు’, మలయాళంలో ‘హే జ్యూడ్’ సినిమాలలో నటించింది త్రిష. అయితే వీటిలో ’96’ మాత్రమే సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలలో, ‘గర్జనై’, ‘చతురంగ వేట్టై’, ‘రాంగి’ సినిమాలలోనూ, మలయాళంలో రామ్ సినిమాలో నటిస్తోంది త్రిష. మరి గ్యాప్ తీసుకుని చేయబోతున్న ‘బృందా’ ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.