వారిని హెచ్చరించిన బండి సంజయ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 30 వ తేదీన రంగారెడ్డి అర్బన్ జిల్లా లింగోజీగూడ డివిజన్ కు జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలిసిన సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై, కలవడానికి దారితీసిన పరిస్థితులపై వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే బిజెపి రాష్ట్ర పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ అకాల మరణం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి… ఏకగ్రీవం కావడానికి తాము అనుకూలమేనని టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే.
దివంగత బిజెపి నాయకుడు రమేష్ గౌడ్ కుటుంబంలోని సభ్యుడికి ఆ డివిజన్ లో కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కోసం మార్గం సుగమం చేస్తామని ప్రతిపాదించిన నేపథ్యంలోనే ఈ అంశం చర్చనీయంగా మారింది. గత ఎన్నికలలో ఎల్బీనగర్ లోని అన్ని మున్సిపల్ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత లింగోజిగూడ డివిజన్ లో బిజెపి మరోసారి విజయం సాధించడం ఖాయమని, పోటీ చేయడానికి బిజెపి సిద్ధమైంది.
Also Read
అయితే ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండా, ఈ విషయాన్ని చర్చించకుండా కేటీఆర్ ను ప్రత్యక్షంగా కలవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశంలో ఈ బృంద నాయకులు ఎవ్వరు కూడా సీనియర్ నాయకులతో చర్చించకపోవడం, వారి అభివప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేటీఆర్ ని కలవడం కూడా పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితో గాని, డా.కె. లక్ష్మణ్ తో గాని చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా రాష్ట్ర పార్టీ భావిస్తోంది.
జరిగిన సంఘటన పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భావించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర నాయకుల అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కలిసిన విషయంలో జరిగిన అన్ని విషయాలను నిగ్గుతేల్చాలని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలలో, ప్రచార సాధనాలలో, వెబ్ చానళ్లలో బిజెపి సీనియర్ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని బిజెపి రాష్ట్ర పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గాని, వివిధ చానళ్లలో వచ్చిన కథనాలలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ కథనాలన్నీ ఊహజనితమైన అభూతకల్పనలే. ఈ తప్పుడు కథనాలతో పాటు జరిగిన విషయాలపై సమగ్ర విచారణ జరుగుతుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!