నల్లగొండ నియోజకవర్గ కమలం పార్టీలో.... జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వన్‌మేన్ షో చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా.. వాళ్ళు వీళ్ళు కాకుండా... డైరెక్ట్‌గా పార్టీ కేడరే అలా మాట్లాడుకుంటోందన్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా నల్లగొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభ పూజా కార్యక్రమం రచ్చ కూడా ఇందులో భాగమేనంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేదిక మీద ఉండగానే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన రచ్చ,
Bhupender Yadav: బీజేపీ కొత్త జాతీయధ్యక్షుడి ఎంపిక కోసం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం, మరో రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించింది. మరో నాలుగు రాష్ట్రాలకు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ రాజ్యాంగ ప్రకారం, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు 37 స్టేట్ ఆర్గనైజేషన్స్‌లో కనీసం 19 రాష్ట్రాలలో అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. బీజేపీకి ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు ఉన్నారు. వీరిలో కొందరు తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య…
నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు…
Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం…
ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జూన్ 9 నాటికి మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు.
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు…
BJP New President: బీజేపీ కొత్త సంవత్సరంలో తమ నూతన సారథిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరికి ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.