Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worst Street Food: ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా చాలా మంది బండ్ల మీద దొరికే ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిలో కల్తీ నూనెలు, పప్పులు వాడుతూ ఉంటారని చెప్పినా పేట్ల మీద పేట్లు లాగించేస్తుంటారు. గల్లీలో ఏ బండి దగ్గర ఏ సమయంలో చూసినా గుంపులు గుంపులుగా జనం కనబడుతుంటారు. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది మన దేశంలో చిరు తిండ్లకు డిమాండ్. రకరకాల టిఫిన్లను ఎగబడి తింటూ ఉంటారు. టిఫిన్లు మాత్రమే కాకుండా ఒక్కో ప్రాంతానికి ఒక్కో వెరైటీ ఫేమస్ ఉంటుంది. వాటిని స్ట్రీట్ ఫుడ్ లో ఉంచితే ఆ ప్రాంతం వారు ఎగబడి తింటూ ఉంటారు. ఉదాహరణకు రాయలసీమ ఉగ్గానికి, నెల్లూరు కారం దోశ, కోల్ కతా పానీపూరి, వడపావ్, ఇక చైనీస్ ఫుడ్స్ మంచురియా, న్యూడిల్స్, పాస్తా, మోమోస్, బ్రెడ్ ఆమ్లెట్, శాండ్ విచ్ లు స్ట్రీట్ ఫుడ్ లో చాలా ఫేమస్.
Also Read: Tips To Escape From drowning Car: మీరు ఉన్న కారు మునిగిపోయిందా? ఇలా తప్పించుకోండి
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
అయితే వంటకాలలో ఉప్మా ఎక్కువ మందికి నచ్చనట్లు ఈ స్ట్రీట్ ఫుడ్ లో కూడా కొన్ని చాలా మందికి నచ్చవు. వాటికి సంబంధించే స్ట్రీట్ ఫుడ్‌లలో అత్యంత చెత్తవి ఏంటన్న దానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ సంస్థ అయిన టేస్ట్ అట్లాస్ అనే కంపెనీ వినియోగదారులు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఏ స్ట్రీట్ ఫుడ్ ఎంత వరస్ట్ అన్న విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ లిస్ట్ లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బోండాలు కూడా చోటు దక్కించుకున్నాయి. అయితే బోండాలు ఈ లిస్ట్ లో టాప్ 10 లో నిలిచాయి.
దీనిలో ఫస్ట్ ప్లేస్ మాత్రం హారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ దహీ పూరీకి దక్కింది. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన సెవ్ పూరీ రెండవ స్థానంలో నిలిచింది. ఇక దబేలీ, బాంబే శాండ్‌విచ్, ఎగ్ భుర్జీ, దహీ వడ, సబుదానా వడ, పాప్రీ చాట్, గోబీ పరాఠా, బోండా వరుస స్థానాల్లో నిలిచాయి. మొత్తం 2,508 మంది రేటింగ్ ఇవ్వగా దహీపూరీని 1,733 మంది వరస్ట్ ఫుడ్ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!