పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచేసింది. ఇక నేడు చిత్ర యూనిట్, సినిమా రిలీజ్ ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న డార్లింగ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పేశాడు. ట్రైలర్ లో పూజా “ప్రేమ విషయంలో ఆదిత్య అంచనా తప్పు” అనే డైలాగ్ ని తీసుకొని ఒక రిపోర్టర్ పెళ్లి .. మీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో మీరు ఉహించారా..? అని అడగగా ప్రేమ విషయంలో నా అంచనాలు.. జీవితంలో ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చాయి.. అందుకే నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వైకాయలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.