మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, రాజయ్యగారి ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన గతాన్ని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన ముత్యం రెడ్డి ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఒక ఆదర్శవంతమైన నేతను కోల్పోయిందని, వారి మరణం బాధాకరమని సిఎం విచారం వ్యక్తం చేశారు. దివంగత ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.