కరోనా వైరస్ మన దేశంలో విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, మృతి చెందుతున్నారు. అయితే ఇటీవల సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతి చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం…
మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, రాజయ్యగారి ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన గతాన్ని సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన ముత్యం రెడ్డి ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేసుకున్నారు.…