సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఎప్పుడూ గరం గరంగా ఉంటారు. రాజ్యసభలో ఛైర్మన్‌ను కూడా దడదడలాడిస్తుంటారు. తన పేరు పక్కన అమితాబ్ బచ్చన్ పేరును ఛైర్మన్ ఉచ్ఛరించినందుకు ఓ ఆటాడుకుంది. అంతలా ఫైర్‌బ్రాండ్‌గా ఉంటారు.
Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Parliament Panel: వలసవాద కాలం నాటి క్రిమినల్ చట్టాల సవరణలో భాగంగా వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయ శిక్షాస్మృతి- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు భారతీయ సాక్ష్యాధారాల చట్టం - భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, మరియు భారతీయ సాక్ష్యా అధినియం వంటి మూడు బిల్లులను ఈ ప్యానెల్ అధ్యయనం చేస్తోంది.
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా కేసులో చిక్కుకుంది.
Parliament panel examining Marriage Bill gets another 3 months extension: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లు 2021ను పరిశీలించే.. విద్యా,మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయి సంఘానికి మరో మూడు నెలల గడువును పొడగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధంఖర్ పొడగింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ వివాహ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్‌లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం…